- 47తో మొదలై 24 వేలకుపైగా మెజారిటీ
- 1,7,10 రౌండ్లు మినహాఅన్నింట్లోనూ 2 వేలకుపైగానే లీడ్
- ఏ డివిజన్‌లోనూఆధిక్యంలోలేని బీఆర్ఎస్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో ప్రతి రౌండ్‌లో కాంగ్రెస్ హవా కొనసాగింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఓట్ల లెక్కింపు మొత్తం 10 రౌండ్లలో పూర్తయింది. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 47 ఓట్ల మెజారిటీతో మొదలైన ట్రెండ్.. చివరకు 24,729 ఓట్ల ఆధిక్యంతో ముగిసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. డివిజన్లవారీగా చూస్తే.. ఎక్కడా బీఆర్ఎస్ మెజారిటీ సాధించలేదు. కాంగ్రెస్‌కు అత్యల్పంగా ఫస్ట్ రౌండ్‌లో 47 ఓట్ల మెజారిటీ రాగా, అత్యధికంగా ఏడో రౌండ్‌లో 4వేల ఓట్ల లీడ్ వచ్చింది. 1,7, 10 రౌండ్లు మినహా ఏడు దఫాల్లోనూ 2 వేలకుపైగానే మెజారిటీ సాధించింది. హోం ఓటింగ్‌లో భాగంగా స్వీకరించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ 18 ఓట్ల లీడ్ వచ్చింది.
అలాగే, డివిజన్ల వారీగా చూస్తే..రెహమత్ నగర్‌లో అత్యధికంగా 5,695 ఓట్ల లీడ్‌లో కొనసాగింది. అత్యల్పంగా షేక్‌పేట్ డివిజన్ లో 1,940 ఓట్ల మెజారిటీ వచ్చింది. పర్సంటేజీ పరంగాచూస్తే యూసుఫ్‌గూడ డివిజన్‌లో కాంగ్రెస్‌కు 55శాతం ఓట్లు వచ్చాయి. అలాగే రెహమత్‌నగర్‌లో 53 శాతం ఓట్లు, వెంగళరావునగర్ డివిజన్‌లో 52 శాతం, సోమాజిగూడ డివిజన్‌లో 51శాతం, బోరబండ డివిజన్‌లో 49 శాతం, ఎర్రగడ్డ, షేక్‌పేట్ డివిజన్లలో 42 శాతం చొప్పున ఓట్లు వచ్చాయి. ఇలా ఓవరాల్‌గా కాంగ్రెస్‌కు 51శాతం ఓట్లు రాగా.. బీఆర్ఎస్ 38 శాతం ఓట్లు మాత్రమే సాధించింది.
