
బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెకుతున్న హడ్డీ మూవీకి సంబంధించి అప్ డేట్ వచ్చేసింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ ట్రాన్స్ జెండర్ లుక్ లో ఉన్న ఓ చిన్న వీడియాతో పాటు పోస్టర్ ను చిత్ర బృందం రివిల్ చేసింది. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జీ స్టూడియోస్ తన ఇన్ స్టాలో పోస్టు చేసింది. ట్రాన్స్‌జెండర్ మేకప్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ దాదాపు మూడు గంటల పాటు తన కుర్చీలోనే ఉండిపోయారని తెలిపింది.
దీనిపై స్పందించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ నిపుణుల సమక్షంలో తాను కుర్చీలో దాదాపు మూడు గంటలు కూర్చోవడం తన కెరీర్లో ఇదే మొదటిసారి అని చెప్పారు. ఈ పాత్రను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి కొత్త లుక్ తనకు శక్తిని ఇచ్చిందన్నారు. దీనిపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూసేందుకు తాను వేచి ఉండలేనన్నారు. ఇక హడ్డీ సినిమాలో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్, ఆనందితా స్టూడియోస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2023లో ఈ చిత్రం జీ స్టూడియోస్‌లో విడుదల కానుంది.