నయనతార ‘అంజలి సి.బి.ఐ’ ట్రైలర్‌ రిలీజ్

నయనతార ‘అంజలి సి.బి.ఐ’ ట్రైలర్‌ రిలీజ్

నయనతార పోలీస్ ఆఫీసర్ గా నటించిన తమిళ సినిమా ‘ఇమైక్క నోడిగల్’. ఈ చిత్రం తమిళంలో హిట్ అయింది. దీంతో ఈ మూవీని తెలుగులోకి అనువదించి రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు నిర్మాతలు. కథ మొత్తం ఒక సైకో విలన్ చుట్టూ తిరుగుతుంది. వరుస హత్యలతో పోలీసులకు చాలెంజ్ విసురుతున్న హంతకున్ని పట్టుకోవడానికి అంజలి అనే ఆఫీసర్ రంగంలోకి దిగుతుంది. నయనతార.. అంజలి అనే సి.బి.ఐ ఆఫీసర్ పాత్రలో నటించగా.. సైకో విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ డైరక్టర్ అనురాగ్ కష్యప్ ఆకట్టుకున్నారు.

‘ఈ లోకంలో జరుగుతున్న ప్రతి మంచికి, చెడుకు.. ప్రతి కదలిక వెనుక ఓ ప్రేమ ఉంది. ఆ ప్రేమ దేనిమీదైనా కలగొచ్చు.. ఐ లవ్‌ కిల్లింగ్‌. నాకు చంపడం ఇష్టం’ అంటూ విలన్ ను పరిచయం చేస్తూ మొదలైన ‘అంజలి సి.బి.ఐ’ సినిమా ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయని సినీవర్గాలు తెలిపాయి. ఈ మూవీ  ట్రైలర్ ను మంగళవారం హైదరాబాద్ లో రిలీజ్ చేశారు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్.

అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా…క్యామియో ఫిల్మ్స్ పతాకంపై సిజే జ‌య‌ కుమార్ నిర్మించారు. హిప్ హాప్ త‌మిళ‌న్ సంగీతం అందించారు. విశ్వ‌శాంతి క్రియేష‌న్స్ సంస్థ ఈ సినిమాను ఫిబ్రవరి 22న తెలుగులో విడుదల చేయబోతోంది. ఇందులో..విజయ్‌ సేతుపతి, అథ‌ర్వ‌, రాశీఖ‌న్నా ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.