నీట్ ఫలితాల్లో సత్తా చాటిన  గురుకుల స్టూడెంట్స్

నీట్ ఫలితాల్లో సత్తా చాటిన  గురుకుల స్టూడెంట్స్


హైదరాబాద్, వెలుగు: నీట్ యూజీ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారాని సెక్రటరీ సైదులు వెల్లడించారు. పరీక్షకు మొత్తం193 మంది అటెండ్ కాగా వారిలో176 మంది ఉత్తీర్ణత సాధించారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 25 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ లో  70  కంటే ఎక్కువ మంది విద్యార్థులకు బీడీఎస్​, వెటర్నరీ, హోమియో, ఆయుర్వేదిక్, యూనానీ కోర్సుల్లో సీటు  వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. నీట్​పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్​ అభినందించారు. గురుకుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామనడానికి ఈ ఫలితాలు ఉదాహారణ అన్నారు. అధ్యాపకులను, గురుకుల సిబ్బందిని ఆయన అభినందించారు. 

ర్యాంకులు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులు

బి. హిమణి(490) జి. సుప్రియ (485) ఎం. శివాత్మిక (473), బి. కల్పిత(466) జి. హర్షిణి(450) కె. సాయి సోనిక(449), ఎం.గౌతమి (448), ఎస్. స్నిగ్ధ(432), పి.త్రిష (424), కె. శ్రావణ్ కుమార్ (417), జి.అక్షిత (414). ఎల్. శ్రియ (408), కె. స్వాతి (407), టి. ముత్తవ్వ (406), జి. కీర్తి (402) ఉన్నారని సైదులు తెలిపారు.

ఎస్సీ గురుకులాల్లో 300 పైగా ర్యాంకులు

ఎస్సీ గురుకుల సొసైటీలో  333 మంది విద్యార్థులు నీట్ ఫలితాల ఆధారంగా ఎంబీబీఎస్,  బీడీఎస్, ఇతర వైద్య సీట్లను సాధించనున్నారని సెక్రటరీ శారదా, అకాడమీక్ డైరెక్టర్ సక్రు నాయక్ తెలిపారు. ర్యాంకర్లకు ఎస్సీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ సెక్రటరీ విజయంద్ర బోయి అభినందనలు తెలిపారు.