‘నేనూ.. నా ప్రపంచం.. ఉద్యోగ ప్రస్థానం’ పుస్తకావిష్కరణ

‘నేనూ.. నా ప్రపంచం.. ఉద్యోగ ప్రస్థానం’ పుస్తకావిష్కరణ

కరీంనగర్, వెలుగు: విశ్రాంత అధ్యాపకుడు, రచయిత వేముల సత్యనారాయణ గత 52 ఏండ్లుగా రాసుకున్న డైరీని పుస్తకం రూపంలోకి తీసుకొచ్చి ‘నేనూ.. నా ప్రపంచం.. ఉద్యోగ ప్రస్థానం’ పేరుతో ఆవిష్కరించారు.  కరీంనగర్ ఫిలిం భవన్ లో సాహితీ సోపతి ఆధ్వర్యంలో ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన పుస్తకావిష్కరణకు ప్రముఖ సాహిత్య పరిశోధకుడు డాక్టర్​మచ్చ హరిదాసు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.

1979 నుంచి 2012 వరకు ఉపాధ్యాయుడిగా, ఉపన్యాసకుడిగా 33 ఏళ్లపాటు కొనసాగిన సత్యనారాయణ ఉద్యోగ జీవన గమనాన్ని ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను కళ్లకు కట్టారని కొనియాడారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా.నలిమెల భాస్కర్, ప్రముఖ కథా రచయిత డాక్టర్​బీవీఎన్ స్వామి, ప్రముఖ కవులు జూకంటి జగన్నాథం, బూర్ల వెంకటేశ్వర్లు, కూకట్ల తిరుపతి, రంగినేని మోహనరావు, మద్దికుంట లక్ష్మణ్, పీఎస్ రవీంద్ర, నగునూరి శేఖర్, డి.శంకరయ్య, ఎన్.రామయ్య, కె.అంజయ్య, గుండు రమణయ్య, నీలవేణి, వి.ప్రభావతి, ఎన్.సావిత్రి, ఎన్.రాజేశ్వరి, ఎ.సుజాత, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.