25ఏళ్ల చరిత్రలో భారీ నష్టాల్లో నెట్‌ఫ్లిక్స్...

25ఏళ్ల చరిత్రలో భారీ నష్టాల్లో నెట్‌ఫ్లిక్స్...

ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో  970,000 మంది సబ్ స్క్రైబర్స్ ను కోల్పోయిందని అత్యంత పేరు సంపాదించుకున్న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లలో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఆ కంపెనీ 25 సంవత్సరాల చరిత్రలో అత్యంత నష్ట పరిణామాలను చవిచూడడం ఇదే మొదటిసారి. నెట్‌ఫ్లిక్స్ షేర్ ధర ఈ సంవత్సరం 67% క్షీణించింది. రానున్న రోజుల్లో తక్కువ ధరకే  ప్రకటనలను అందించాలని నెట్‌ఫ్లిక్స్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తమ ఆదాయాన్ని తిరిగి వృద్ధి చేయడమే ప్రస్తుతం తమ ముందున్న సవాలు అని  నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.  గత నెలలో.. దిగ్గజ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించింది. మొదటి రౌండ్‌లో Netflix దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది.  ఇప్పుడు Netflixలో రెండవ రౌండ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టినట్టు సమాచారం.