తెలంగాణ డీజీపీ ఫోటో వాడి సైబర్ అటాక్..

తెలంగాణ డీజీపీ ఫోటో వాడి సైబర్ అటాక్..

సైబర్ మోసాలకు పాల్పడడంలో నేరగాళ్లు కొత్త రూట్ ఎంచుకున్నారు. చిన్న చితక ఆఫీసర్లును వాడుకుంటే పెద్దగా లాభం ఉండదనే ఉద్దేశంతోని ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతోనే మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సప్ డీపీకి డీజీపీ రవి గుప్తా ఫొటో పెట్టి ఓ వ్యాపార వేత్త కూతురికి వాట్సప్ కాల్ చేశారు. డ్రగ్స్ కేసు అరెస్ట్ చేస్తామని నమ్మించే ప్రయత్నం చేశారు. కేసు నుంచి తప్పించాలంటే 50వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

+92 కోడ్ తో కాల్ రావడంతో అనుమానించిన వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది పాకిస్థాన్ కోడ్ గా సైబర్ పోలీసులు గుర్తించారు. అనుమానిత నంబర్ల నుంచి ఫోన్లు చేసి డబ్బులు అడిగినా, లింక్ లు షేర్ చేసినా సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచేందుకు మరింత కృషి చేస్తామని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.