రచయిత్రి లతా పేష్కర్‌ కు.. ‘ఇన్‌ స్పిరేషనల్‌ ఉమెన్‌ అవార్డ్‌’

రచయిత్రి లతా పేష్కర్‌ కు.. ‘ఇన్‌ స్పిరేషనల్‌ ఉమెన్‌ అవార్డ్‌’

పద్మారావునగర్​,వెలుగు: ప్రముఖ రచయిత్రి లతా పేష్కర్ రచనలు చిన్నారులను స్ఫూర్తిదాయక కథలతో ప్రేరేపిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. బేగంపేట దేవనార్‌ అంధుల పాఠశాలలో ‘ విలాస ద సైన్స్‌ ఆఫ్‌ మాక్సిన్‌’, అశ్లీ పబ్లికేషన్ ఆధ్వర్యంలో లతా పేష్కర్​ను ‘ఇన్ స్పిరేషనల్ ఉమెన్ అవార్డు’తో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా పసుపులేటి శ్రీవల్లి, మాజీ మిస్‌ ఇండియా- కృతిక శర్మ మాట్లాడుతూ లతా పేష్కర్ రచనలు  పిల్లల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.  త్వరలో ఆమె ఏడో పుస్తకం ‘గ్రోయింగ్‌ ఆఫ్ ​-గ్రోయింగ్‌ వాయిస్‌’ విడుదల కానుందని తెలిపారు.