చలి మంట కాగుతూ.. నిప్పంటుకొని వృద్ధురాలు మృతి

చలి మంట కాగుతూ..  నిప్పంటుకొని  వృద్ధురాలు మృతి

గన్నేరువరం, వెలుగు: చలిమంట కాగుతూ ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఓ వృద్ధురాలు చనిపోయింది. ఎస్సై నరేందర్ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రామంచ నర్సవ్వ(85) ఆదివారం ఉదయం ఇంటి ముందు ఉన్న పొయ్యిలో మంట పెట్టుకొని ప్లాస్టిక్  కుర్చీపై కూర్చొని చలి మంట కాగుతోంది. 

వేడికి కుర్చీ కాలు విరిగి వృద్ధురాలు మంటలో పడిపోవడంతో నర్సవ్వకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. మృతురాలి మనవడు బలరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై 
తెలిపారు.