ఉప్పల్ లో దారుణం.. భార్య గొంతు నులిమి చంపిన భర్త

ఉప్పల్ లో దారుణం.. భార్య గొంతు నులిమి చంపిన భర్త

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకు కాలనీలో భార్య గొంతు నులిమి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే జనగామకు చెందిన రమేష్, కమల ఇద్దరు ఉప్పల్ లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే భర్త రమేష్ గత కొన్ని రోజులుగా తన భార్య కమలను అనుమానించడం మొదలుపెట్టాడు.

అలా రోజూ గొడవలు జరగగా సోమవారం అర్థరాత్రి భార్య కమల గొంతు నులిమి హత్య చేశాడు. వెంటనే వెళ్లి స్థానిక పోలీస్ స్టేషల్ లో లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.   రమేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.