Paris Olympics 2024: ఓడినా దేశాన్ని గర్వించేలా చేశావు.. మను బాకర్‌పై నెటిజన్స్ ప్రశంసలు

Paris Olympics 2024: ఓడినా దేశాన్ని గర్వించేలా చేశావు.. మను బాకర్‌పై నెటిజన్స్ ప్రశంసలు

పారిస్ ఒలింపిక్స్ 2024లో మను బాకర్ రెండు పతకాలతో సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ ఇప్పటివరకు సాధించిన మూడు మెడల్స్ లో తొలి రెండు మను బాకర్ నుండి వచ్చినవే. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో.. మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. ఇదే ఊపులో మూడో మెడల్ సాధించే క్రమంలో ఆమె తుది మెట్టుపై బోల్తా పడింది.

శనివారం (ఆగస్టు 3) జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో 4వ స్థానంలో నిలిచింది. మూడ్ స్థానంలో నిలిచి ఉంటే కాంస్య పతకం లభించేది. శుక్రవారం (ఆగస్టు 2) జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ విభాగం క్వాలిఫికేషన్‌లో మను ఫైనల్లో అడుగుపెట్టింది. 590 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొదటి ఎనిమిది మంది షూటర్లు ఫైనల్‌ చేరుకోగా టాప్ 3 లో మను స్థానం సంపాదించలేకపోయింది. ఓడిపోయినా నెటిజన్స్ ఆమెను ప్రశంసిస్తున్నారు. 

ALSO READ | Paris Olympics 2024: హ్యాట్రిక్ మిస్.. తృటిలో మెడల్ చేజార్చుకున్న మను భాకర్

దేశానికి రెండు మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించావని కొందరు అంటుంటే.. దేశాన్ని గర్వపడేలా చేసావని మరికొందరు ఆమెను కొనియాడుతున్నారు. ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించినందుకు ఆమెకు ఇంకొందరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ మను బాకర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు. మీరు బాగా ఆడుతూనే ఉండాలని కోరుకుంటున్నాను". అని అన్నారు