ఏపీలో వైయస్సార్‌ బడుగు వికాసం ప్రారంభం

ఏపీలో వైయస్సార్‌ బడుగు వికాసం ప్రారంభం

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం
శ్రామికులుగా మిగిలిపోతున్న ఎస్సీ, ఎస్టీలు పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నదే నా ఆకాంక్ష –వైఎస్ జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ , ఎస్టీ పారిశ్రామిక వేత్తల కోసం 2020-23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించారు ఆయన. దసరా పండుగ సందర్భంగా హంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం నా అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా… – ఎస్సీలు ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలి..ఎవ్వరికీ తీసిపోని విధంగా పారిశ్రామిక వేత్తలుగా, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి అని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఎప్పుడూ , ఎక్కడా జరగని విధంగా రూ. 1 కోటి రూపాయిలు కూడా ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాం… ఎస్సీలు, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేసేలా కొత్త కొత్త కార్యక్రమాలను చేపడుతున్నాం… వారిలో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్యక్రమాలను చేపడుతున్నాం… ఫెసిలిటేషన్‌ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం.. 16.2 శాతం ఎస్సీలకు, 6శాతం ఎస్టీలకు ఇండస్ట్రియల్‌ పార్కుల్లో భూముల కేటాయింపు .. స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, క్వాలిటీ సర్టిఫికేషన్‌.. పేటెంట్‌ రుసుముల్లో రాయితీలు… ఇలా ఎన్నెన్నో ప్రోత్సాహకాలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు లభిస్తున్నాయని సీఎం జగన్ వివరించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీల మాదిరే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మంచి జరగాలి, వారి కాళ్లమీద వారు నిలబడాలనే ఉద్దేశంతో నవరత్నాలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టాం… సచివాలయాల్లో కూడా 82శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి.. విద్యార్థులకు పూర్తి ఫీజు రియింబర్స్‌ మెంట్‌ అమలుచేస్తున్నామని జగన్ తెలిపారు.అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, నాకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికీ పథకాలు అందడానికి గ్రామ, వార్డు, వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించాం…ఆసరా, చేయూత లాంటి పథకాలను కూడా చేపట్టాం. .. మార్కెటింగ్‌లో ఇబ్బందులు పడకూడదని అమూల్‌ను, పీ అండ్‌ జీని, రిలయన్స్‌లాంటి సంస్థలను తీసుకు వచ్చాం.. – చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు నష్టపోకుండా చూశాం.. ప్రతి ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. . రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరగాలని, మరింత మంచి చేసే అవకాశాన్ని దేవుడు తనకు ఇవ్వాలని కోరుకుంటున్నానని జగన్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన వ్యక్తులు ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే.. ఎలా చేయాలి? ఎవరిని కలవాలి? దీనిపై అధికారులు దృష్టిపెట్టాలని సమావేశంలో ఆదేశించారు సీఎం జగన్.