విమానాల సిబ్బందికి కరోనా వ్యాపించకుండా కొత్త డ్రస్ లు

విమానాల సిబ్బందికి కరోనా వ్యాపించకుండా కొత్త డ్రస్ లు

లాక్ డౌన్ నిబంధనలు సడలింపులు మొదలైన తర్వాత తిరిగి విమాన సర్వీసుల పునరుద్ధరణ ప్రారంభంకానుంది.ఈ క్రమంలో విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ సిబ్బందికి కరోనా వైరస్ సోకకుండా పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లు, విమానాశ్రయాల్లో పనిచేసే ఇతర సిబ్బందికి ప్రత్యేక డ్రస్ కోడ్ ను సిద్ధం చేశాయి. విమాన సిబ్బంది సురక్షితంగా ఉండేందుకు ఫేస్ షీల్డులు, గౌన్లు, మాస్క్ లు, పీపీఈ కిట్లను అందించాలని నిర్ణయించామని పౌరవిమానయాన సంస్థలు తెలిపాయి.

దీనికి సంబంధించి ఎయిర్ ఇండియాతో పాటు, ఇండిగో, విస్తారా, ఎయిర్ ఏసియా తదితర సంస్థలు సంయుక్తంగా ఓ నిర్ణయం తీసుకుని, కొత్త డ్రెస్ కోడ్ ను ఖరారు చేశాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ ఎయిర్ ఆసియా సిబ్బంది గత నెల 27న కొత్త డ్రస్ కోడ్ లో కనిపించగా, ఆప్రాన్స్, గౌన్లు, మాస్క్ లతో విస్తారా ఎయిర్ లైన్స్ కూడా కొత్త డ్రస్ కోడ్ ను ప్రవేశపెట్టింది.