సూర్యాపేట చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు.. హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

సూర్యాపేట చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు.. హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

సూర్యాపేట మాస్టర్​ప్లాన్​కు అడుగులు ముందుకు పడుతున్నాయి. 2045 వరకు పట్టణ అవసరాలకు తగినట్టుగా అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. సూర్యాపేట మున్సిపాలిటీలో 1982లో అప్పటి జనాభా ప్రతిపాదికన రూపొందించిన మాస్టర్‌‌‌‌‌‌ ప్లానే నేటికీ కొనసాగుతోంది. ప్రతీ 20 ఏండ్లకు ఒకసారి మాస్టర్‌‌ ‌‌ప్లాన్‌‌ ‌‌రూపొందించాలి. కానీ సూర్యాపేటలో పాత మాస్టర్ ప్లానే అమలవుతోంది.

నూతన ప్లాన్‌‌‌‌..

రానున్న 20 ఏండ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నూతన మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ను అధికారులు రూపొందించారు. గతంలో సూర్యాపేట పట్టణం 24 చదరపు మైళ్ల మేర విస్తరించి ఉండగా, కొత్త ప్లాన్‌‌ ‌‌ప్రకారం 93.48 చదరపు మైళ్లు విస్తరించనుంది. మొత్తం 950 కిలో మీటర్ల రోడ్లతో పట్టణం అభివృద్ధి చెందనుంది. 2018లో మున్సిపాలిటీలో విలీనమైన దురాజ్ పల్లి, కుడకుడ, కుసుమవారిగూడెం, కుప్పిరెడ్డిగూడెం, రాయినిగూడెం, తదితర ప్రాంతాలు కొత్త మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ లోకి వస్తాయి. 

పెరిగిన జనాభా, మరో 20 ఏండ్ల వరకు పెరిగే 20 శాతం జనాభా, వచ్చే ఆదాయ వనరులను దృష్టిలో ఉంచుకొని మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ రూపొందిస్తున్నారు. పట్టణాన్ని నివాసిత, పారిశ్రామిక, వాణిజ్య, మిక్స్ డ్‌‌‌‌, వాటర్‌‌‌‌ బాడీస్‌‌‌‌, వ్యవసాయ జోన్‌‌‌‌, అర్బనైజబుల్‌‌‌‌, పబ్లిక్‌‌‌‌, సెమీ పబ్లిక్‌‌‌‌, గ్రేవ్‌‌ ‌‌యార్డ్‌‌‌‌, ట్రాఫిక్‌‌‌‌, రవాణా, రిక్రియేషన్స్‌‌‌‌, బఫర్‌‌‌‌ ‌‌వంటి జోన్లు విభజించారు. వచ్చే 20 ఏండ్లలో రోడ్లు, పార్కులు, వీధి లైట్లు, ట్రాన్స్‌‌‌‌ఫోర్ట్‌‌‌‌, డంపింగ్‌‌‌‌యార్డు, తాగునీటి వసతులు, పబ్లిక్‌‌ ‌‌టాయిలెట్లు, విద్య, వాణిజ్య సంస్థలు, జంక్షన్లు, ఐటీ హబ్‌‌‌‌, మెడికల్‌‌‌‌ కళాశాల, పర్యాటకం, గ్రీన్‌‌‌‌ జోన్లు, జనాభా, భౌగోళిక విస్తీర్ణం మేరకు మౌలిక వసతులు కల్పించేందుకు మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌ ‌‌తయారు చేశారు. 

ఔటర్ రింగ్ రోడ్డు కోసం ప్రపోజల్స్.. 

సూర్యాపేటకు ఔటర్ రింగ్ రోడ్డు కోసం అధికారులు ప్రపోజల్స్ సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఖమ్మం బైపాస్ రోడ్డు నుంచి బుర్కపేట తండా, కొత్త కలెక్టరేట్, దురాజ్ పల్లి, కుసుమవారి గూడెం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించేలా ప్లానింగ్ చేశారు. డ్రాఫ్ట్ అఫ్రూవల్ అయ్యాక పబ్లిక్ సలహాలు తీసుకొని ఫైనల్ చేయనున్నారు.

మారనున్న రూపురేఖలు..

సూర్యాపేట పట్టణంలో కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్, శాంతినగర్, శబరినగర్, కొత్త బస్టాండ్ ఎదురు భాగం తదితర ప్రాంతాలు ఇండస్ట్రియల్‌‌‌‌ జోన్‌‌‌‌లో ఉన్నాయి. వీటితోపాటు సద్దుల చెరువు పక్కన ఉన్న కాలనీలు బఫర్ జోన్ లో ఉన్నాయి. దీంతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే మున్సిపాలిటీ అనుమతులు జారీ చేసేది కాదు. దీంతో అనుమతులు లేకుండానే ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. 

►ALSO READ | కాళేశ్వరం లొకేషన్లు మార్చి అంచనాలు పెంచి..ఎక్స్ పర్ట్స్ కమిటీ సిఫార్సులను తొక్కిపెట్టిన కేసీఆర్

ఈ క్రమంలో మున్సిపాలిటీ ఏటా దాదాపు రూ.100 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతుంది. అయితే నూతన మాస్టర్‌‌ ‌‌ప్లాన్‌‌ ‌‌ప్రకారం ఈ ప్రాంతాలన్నీ రెసిడెన్షియల్‌‌ ‌‌జోన్లుగా మారనున్నాయి.  ఎస్పీ ఆఫీస్ సమీపంలో పబ్లిక్ అవసరాల కోసం ప్రతిపాదించారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు సులభంగా లభించడంతోపాటు మున్సిపాలిటీకి ఆదాయం పెరగనుంది. 

జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించి ఆయన ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేశారు. ఈ పోరాటంలో ఆయన విజయం సాధించి జార్ఖండ్ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కృషి చేశారు. అనంతరం ఆయన మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పని చేశారు.