నుమాయిష్​లో కొత్త సెక్రటేరియెట్​, అమరుల స్తూపం నమూనాలు

నుమాయిష్​లో కొత్త సెక్రటేరియెట్​, అమరుల స్తూపం నమూనాలు

హైదరాబాద్​, వెలుగు: నుమాయిష్​ ఎగ్జిబిషన్​లో ఏర్పాటు చేసిన ఆర్​అండ్​బీ స్టాల్​లో ​కొత్త సెక్రటేరియెట్​ నమూనా, అమరవీరుల స్మారక స్తూపం, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల మోడల్స్​ను ప్రదర్శనకు ఉం చారు. మంగళవారం మంత్రి  ప్రశాంత్​ రెడ్డి ఆ స్టాల్​ను ప్రారంభించారు. ఆర్​అండ్​బీ కట్టిన, కడుతున్న పలు భవనాల నమూనాలను స్టాల్​లో పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్​అండ్​బీ ఆధ్వర్యంలో చరిత్రాత్మక ఐకానిక్​ కట్టడాలు రూపుదిద్దుకున్నాయన్నారు. తెలంగాణ వైభవం, గొప్పతనాన్ని చాటేలా నిర్మాణాలను చేపట్టామని చెప్పారు.

 2014కు ముందు ఆర్​అండ్​బీ30 లక్షల స్క్వేర్​ ఫీట్ల విస్తీర్ణమున్న బిల్డింగులను కడితే.. తెలంగాణ వచ్చాక కోటి స్క్వేర్​ ఫీట్ల నిర్మాణా లు చేపట్టిందన్నారు. వాటికి రూ.20 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ప్రపంచంలోనే స్టెయిన్​లెస్​ స్టీల్​తో కట్టిన గొప్ప కట్టడంగా అమరుల స్తూపం నిలుస్తుందన్నారు. షికాగో, దుబాయ్​ తర్వాత అట్లాంటి నిర్మాణం హైదరాబాద్​లోనే ఉందని మంత్రి చెప్పారు.