ఏప్రిల్ 30న కొత్త సెక్రటేరియట్ ప్రారంభం..

ఏప్రిల్ 30న కొత్త సెక్రటేరియట్ ప్రారంభం..

హైదరాబాద్ లోని కొత్తగా నిర్మించిన సచివాలయానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్ సాగర్ పక్కనే స్మృతి వనాన్ని జూన్ 2న ప్రారంభించేందుకు సీఎం పచ్చజెండా ఊపారు. అంతకుముందు కొత్త సచివాలయాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ జరుగుతున్న భవణ నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు సెక్రటెరీయట్ ప్రారంభతేదీపై అధికారులతో చర్చించారు. మరోవైపు సచివాలయం పక్కనే నిర్మిస్తున్న డా. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఆ తర్వాత సచివాలయమంతా పరిశీలించిన సీఎం కేసీఆర్... త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్‌ 2 లోపు సెక్రటేరియట్‌, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం ప్రారంభించాలని ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.