వర్కింగ్ స్పేస్ లో నయా ట్రెండ్..టెక్కీల ప్లేస్ లో డాక్టర్లు

వర్కింగ్ స్పేస్ లో నయా ట్రెండ్..టెక్కీల ప్లేస్ లో డాక్టర్లు

ఒకప్పుడు ఐటీ ఎంప్లాయీస్ తో కళకళలాడిన కో వర్కింగ్ సెంటర్లలో ఇప్పుడు డాక్టర్లు కనిపిస్తున్నారు. లాక్ డౌన్ తో దివాలా తీసిన బిజినెస్ ను ఆపరేటర్లు డిమాండ్ తగ్గట్టు కొత్త రూట్ లో నడిపిస్తున్నారు .ప్రస్తుతం ఫైనాన్స్, హెల్త్, బిజినెస్ ట్రాన్సా క్షన్స్ అన్నీవైద్యం చుట్టూ నే తిరుగుతుండడంతో కో వర్కింగ్ స్పే స్ ఆపరేటర్లు అవకాశాలను సృష్టిం చుకుంటున్నారు. వర్క్ ఫ్రం హోంతో టెక్కీలంతా ఇంటి దారి పట్టడంతో మూడు నెలలపాటు వర్కింగ్ స్పేస్ ఆపరేషన్స్ ఆగిపోయాయి. అన్ లాక్ తర్వాత కూడా మార్కెట్ పుంజుకోకపోవడం, మెడికల్ రిలేటెడ్ అంశాలకు మంచి అవకాశాలు ఉండటంతో కోవర్కింగ్ స్పే స్ ఆపరేటర్లు ఆ వైపు మళ్లుతున్నారు . డాక్టర్లకు వర్కింగ్ స్పే స్ ను ప్రొవైడ్ చేస్తూ బిజినెస్ పెంచుకుంటున్నారు . టెలీ కన్సల్టేషన్ కు వీలుగా… సిటీలో కరోనా వ్యాప్తి కారణంగా డాక్టర్లు పెద్దగా

ఓపీ చూడడం లేదు. టెలీ మెడిసిన్, ఆన్ లైన్ కన్సల్టేషన్ కే ప్రయారిటీ ఇస్తున్నారు . డాక్టర్లు ఇంటి నుంచే వైద్య సేవలు అందిస్తున్నారు . అయితే తరుచూ టెక్నికల్ ఇష్యూస్ ఎదురవుతుండడం, వర్కింగ్ స్పే స్ కన్వినెం ట్ గా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ఇలాంటి పరిస్థితుల్లో హై స్పీడ్ ఇంటర్నెట్, ప్రైవసీతోపాటు వర్కింగ్ అట్మాస్పియర్ ఉండేలా వర్కింగ్ స్పే స్ ను ఎంచుకుంటున్నారు . హిమయత్ నగర్ లో ఉండే మధుకర్ నాలుగేండ్లుగా ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఫిజీషియన్ గా చేస్తున్నారు . మార్నిం గ్, ఈవెనింగ్ కన్సల్టేష న్ సేవలు అందిస్తుండగా కరోనాతో డ్యూటీలకు ఆటంకం ఏర్పడిం ది. ఇప్పుడు టెలీ మెడిసిన్ సంస్థల నుంచి అవుట్సోర్సిం గ్ జాబ్స్ అవకాశాలు పెరగడంతో డైలీ ఉదయం నుంచి సాయంత్రం వరకు హిమాయత్ నగర్ లోని వర్కింగ్ స్పే స్ కేంద్రం గా చేసుకుని వైద్య సేవలు అందిస్తున్నారు.

డాక్టర్ స్పేస్.. ఇన్నోవేటివ్ థాట్

కో వర్కింగ్ స్పేస్ అంటే ఇప్పటిదాకా టెక్కీలకు మాత్రమే. పెరుగుతున్న డాక్టర్స్ ఆన్ లైన్ కన్సల్టెన్సీని దృష్టిలో ఉంచుకుని దేశంలోనే తొలిసారిగా ఇన్నోవేటివ్ ఆలోచనతో డాక్టర్ వర్కింగ్ స్పేస్ ను స్టార్ చేశాం. మొదట ఒక్క బ్రాంచ్ లో కొన్ని సీట్లు కేటాయించాం. ఇప్పుడు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో వర్కింగ్  స్పేస్ ప్రొవైడ్ చేస్తు న్నాం. లాక్ డౌన్ తో మార్కెట్ పడిపోయినా డాక్టర్ స్పేస్ తో మళ్లీ పుంజుకుంటోంది. ఆన్ లైన్ కన్సల్టేషన్, టెలీ మెడిసిన్ సేవలకు అనుకూలంగా ఉండటంతో డాక్టర్లు, మెడికల్ రిప్రజెంటేటివ్ కన్సల్ట్ అవుతున్నారు . 50% గ్రోత్ రేట్ తో డాక్టర్ వర్కింగ్ స్పేస్ దూసుకుపోతోంది. – తరుణ్, కో కర్మ వర్కింగ్ స్పేస్