TSPSC పేపర్ లీకేజీ కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు

TSPSC పేపర్ లీకేజీ కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు

TSPSC పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పేపర్ లీకేజీలో కొత్తకోణం భయటకు వచ్చింది. TSPSC  సెక్రటరీ పీఏ ప్రవీణ్ ని కీలకనిందితుడిగా పోలీసులు గుర్తించారు. లీకైన పేపర్ ఒకటి పది లక్షలకు విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ప్రవీణ్ ను కీలక వ్యక్తిగా గుర్తించిన పోలీసులు గతంలో అతను ఏమైనా లీకేజీలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టీఎస్‌పీఎస్సీ ప‌రీక్షా పేప‌ర్లు హ్యాకింగ్ అవడంతో మార్చి 12న జరగాల్సిన టీపీబీవో( టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ) రాత‌ప‌రీక్ష, 15, 16వ తేదీల్లో నిర్వహించాల్సిన వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జన్ రాత‌ప‌రీక్షను వాయిదా వేస్తున్నట్లుగా టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.  పరీక్ష వాయిదా పడినట్లుగా అభ్యర్థులకు SMS ద్వారా సమాచారం అందించారు.  వాయిదా పడ్డ పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. 175టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి పోయిన ఏడాది సెప్టెంబర్ లో టీఎస్‌పీఎస్సీ  నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 34 వేలమంది ధరఖాస్తు చేసుకున్నారు.