సాలిడ్‌‌ క్యారెక్టరైజేషన్‌‌

సాలిడ్‌‌  క్యారెక్టరైజేషన్‌‌

మరో రెండు నెలల్లో ప్రభాస్‌‌ సినిమా ‘ఆదిపురుష్‌‌’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ఈ నెలాఖరు నుండి ప్రమోషన్‌‌లో మరింతగా స్పీడు పెంచబోతున్నారు. మరోవైపు ప్రాజెక్టె కె, సాలార్‌‌‌‌ చిత్రాలతో పాటు మారుతి డైరెక్షన్‌‌లో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్‌‌. ఇందులో ప్రశాంత్‌‌ నీల్‌‌ డైరెక్ట్ చేస్తున్న ‘సాలార్‌‌‌‌’ సినిమా గురించి రోజుకో కొత్త అప్‌‌డేట్‌‌ తెరపైకొస్తోంది. టీమ్ ఎవరూ అనౌన్స్ చేయనప్పటికీ ఇది రెండు భాగాలుగా రాబోతోందని ఇప్పటికే ఓ టాక్ ఉంది. ఇటీవల కన్నడ నటుడు దేవరాజ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కన్‌‌ఫర్మ్ చేశాడు.

ఫస్ట్ పార్ట్‌‌లో కంటే సెకెండ్‌‌ పార్ట్‌‌లో తన క్యారెక్టర్‌‌‌‌కు ఇంపార్టెన్స్‌‌ ఎక్కువని ఆయన చెప్పారు. ఇక ప్రభాస్‌‌ ఇందులో డ్యూయెల్ రోల్ చేస్తుండగా అందులో ఓ క్యారెక్టర్‌‌‌‌ నెగిటివ్‌‌ టచ్‌‌తో ఉండబోతోందని తెలుస్తోంది. క్రిమినల్స్‌‌ను కూడా వణికించే దేవా అనే పవర్‌‌‌‌ఫుల్ గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌గా ప్రభాస్‌‌ కనిపించబోతున్నాడట. ఇలా నెగిటివ్‌‌ క్యారెక్టర్‌‌‌‌లోనే హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం ప్రశాంత్ నీల్ స్టైల్. ‘కేజీఎఫ్‌‌’లో కూడా ఇది చూశాం. ప్రభాస్‌‌కు కూడా ఇలాంటి పాత్ర కొత్తేమీ కాదు. గతంలో ‘బిల్లా’లో ఈ తరహా హీరోయిజాన్ని చూశాం. దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత మళ్లీ అలాంటి పవర్‌‌‌‌ఫుల్‌‌ క్యారెక్టర్‌‌‌‌లో ప్రభాస్‌‌ని చూడబోతున్నాం. ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది. శ్రుతిహాసన్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.