‘ఏజెంట్’ నుంచి కొత్త అప్డేట్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే

‘ఏజెంట్’ నుంచి కొత్త అప్డేట్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే

టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ దర్శకుడు స్టైలిష్ హీరోతో కలిసి సినిమా తీస్తే ఎలా ఉంటుంది? అక్కినేని అఖిల్ తో సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఏజెంట్ సినిమా ఇలాంటి క్యూరియాసిటీనే పెంచుతోంది. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా మూవీ టీం కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ఇదివరకు విడుదలైన ప్రచార చిత్రాల్లోనే అఖిల్ లుక్ కు అభిమానులు ఫిదా అయ్యారు. 

తాజా పోస్టర్లో గన్ పట్టుకుని నిలబడిన లుక్ అదిరిపోయింది. మహేశ్ బాబు తర్వాత హాలీవుడ్ ఫేషియల్ ఫీచర్స్ ఉన్న హీరో అఖిలే అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. సురేందర్ రెడ్డి హీరో అంటేనే స్టైలిష్ లుక్ కు కేరాఫ్ అంటారు. అతిథి లో మహేశ్, ఊసరవెల్లిలో ఎన్టీఆర్, రేసుగుర్రం లో బన్నీ లుక్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. 

ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే డేట్ కూడా ఖరారైంది. ఏప్రిల్ 28న ఏజెంట్ ను విడుదల చేయనున్నట్టుగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. మళయాలం స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా రానుంది. వక్కంతం వంశీ స్ర్కీన్ ప్లేను అందించనున్నాడు. అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య నటిస్తోంది. లెటెస్ట్ సెన్సేషన్ హిప్ హాప్ తమీజా స్వరాలను అందించనున్నాడు. 

https://twitter.com/AKentsOfficial/status/1644197809665753088