
19వ ఓవర్ : భారత్ స్కోరు 94/4
19వ ఓవర్లో భారత్కు 7 పరుగులు లభించాయి. ఫెర్గ్యూసన్ బౌలింగ్లో మూడు సింగిల్స్, ఒక ఫోర్ వచ్చింది. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా (14) , సూర్యకుమార్ యాదవ్(21) పరుగులతో ఉన్నారు.
18వ ఓవర్ : భారత్ స్కోరు 87/4
18వ ఓవర్లో భారత్కు 5 పరుగులు లభించాయి. సాంట్నర్ బౌలింగ్లో ఐదు సింగిల్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా (7) , సూర్యకుమార్ యాదవ్(20) పరుగులతో ఉన్నారు.
17వ ఓవర్ : భారత్ స్కోరు 82/4
17వ ఓవర్లో భారత్కు 5 పరుగులు లభించాయి. చాప్ మన్ బౌలింగ్లో మూడు సింగిల్స్, టుడీ వచ్చింది. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా (4) , సూర్యకుమార్ యాదవ్(18) పరుగులతో ఉన్నారు.
16వ ఓవర్ : భారత్ స్కోరు 77/4
16వ ఓవర్లో భారత్కు 4 పరుగులు లభించాయి. ఇష్ సోధీ బౌలింగ్లో నాలుగు సింగిల్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా (3) , సూర్యకుమార్ యాదవ్(15) పరుగులతో ఉన్నారు.
15వ ఓవర్ : వాషింగ్టన్ సుందర్ (10) ఔట్, భారత్ స్కోరు 73/4
రెండో టీ20లో భారత్ నాల్గో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ (10) ఔటయ్యాడు. అటు 15వ ఓవర్లో భారత్కు 3 పరుగులు లభించాయి. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లో రెండు రన్స్, ఒక వైడ్ వచ్చింది. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా (1) , సూర్యకుమార్ యాదవ్(12) పరుగులతో ఉన్నారు.
14వ ఓవర్ : భారత్ స్కోరు 70/3
14వ ఓవర్లో భారత్కు 5 పరుగులు లభించాయి. బ్రేస్ వెల్ బౌలింగ్లో మూడు సింగిల్స్, టుడీ వచ్చింది. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్(10), సూర్యకుమార్ యాదవ్(13) పరుగులతో ఉన్నారు.
13వ ఓవర్ : భారత్ స్కోరు 66/3
13వ ఓవర్లో భారత్కు 9 పరుగులు లభించాయి. ఇష్ సోధీ బౌలింగ్లో వైడ్ సహా 9 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్(8), సూర్యకుమార్ యాదవ్(10) పరుగులతో ఉన్నారు.
12వ ఓవర్ : భారత్ స్కోరు 57/3
12వ ఓవర్లో భారత్కు 6 పరుగులు లభించాయి. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లో ఒక ఫోర్, రెండు సింగిల్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్(6), సూర్యకుమార్ యాదవ్(4) పరుగులతో ఉన్నారు.
11వ ఓవర్ : రాహుల్ త్రిపాఠి (13) ఔట్, భారత్ స్కోరు 51/3
రెండో టీ20లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఇష్ సోధీ బౌలింగ్లో రాహుల్ త్రిపాఠి (13) ఔటయ్యాడు. దీంతో భారత్ 50 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది. అటు 11వ ఓవర్లో భారత్కు 2 పరుగులే లభించాయి. ఇష్ సోధీ బౌలింగ్లో రెండు సింగిల్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్(1), సూర్యకుమార్ యాదవ్(3) పరుగులతో ఉన్నారు.
10వ ఓవర్ : భారత్ స్కోరు 49/2
10వ ఓవర్లో భారత్కు 3 పరుగులే లభించాయి. సాంట్నర్ బౌలింగ్లో మూడు సింగిల్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో రాహుల్ త్రిపాఠి (13), సూర్యకుమార్ యాదవ్(2) పరుగులతో ఉన్నారు.
9వ ఓవర్ : ఇషాన్ కిషన్ (19) ఔట్, భారత్ స్కోరు 46/2
రెండో టీ20లో భారత్ సెకండ్ వికెట్ కోల్పోయింది. ఇషాన్ కిషన్ (19) ఔటయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లో రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 46 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. అటు 9వ ఓవర్లో భారత్కు 3 పరుగులే వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో రాహుల్ త్రిపాఠి (12), సూర్యకుమార్ యాదవ్(0) పరుగులతో ఉన్నారు.
8వ ఓవర్ : భారత్ స్కోరు 43/1
8వ ఓవర్లో భారత్కు 9 పరుగులు వచ్చాయి. ఇష్ సోధీ బౌలింగ్ రాహుల్ త్రిపాఠి ఫోర్ కొట్టాడు. ప్రస్తుతం క్రీజులో రాహుల్ త్రిపాఠి (12), ఇషాన్ కిషన్ (18) పరుగులతో ఉన్నారు.
7వ ఓవర్ : భారత్ స్కోరు 34/1
7వ ఓవర్లో భారత్ కు 5 పరుగులు వచ్చాయి. బ్రేస్ వెల్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ ఒక ఫోర్ కొట్టాడు. ప్రస్తుతం క్రీజులో రాహుల్ త్రిపాఠి (5), ఇషాన్ కిషన్ (15) పరుగులతో ఉన్నారు.
6వ ఓవర్ : భారత్ స్కోరు 29/1
6వ ఓవర్లో భారత్ కు 7 పరుగులు వచ్చాయి. సాంట్నర్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ ఒక ఫోర్ కొట్టాడు. ప్రస్తుతం క్రీజులో రాహుల్ త్రిపాఠి (5), ఇషాన్ కిషన్ (11) పరుగులతో ఉన్నారు.
20 వ ఓవర్ : న్యూజిలాండ్ స్కోరు 99/8
రెండో టీ20లో భారత్ బౌలర్లు దుమ్మురేపారు. అద్భుతమైన బౌలింగ్తో న్యూజిలాండ్ 99 పరుగులకే కట్టడి చేశారు. భారత బౌలర్ల ధాటికి పరుగులు చేయలేక చతికిలపడిన కివీస్..టీమిండియాకు కేవలం 100 పరుగుల స్వల్ప టార్గెట్ ను నిర్దేశించింది.
19వ ఓవర్ : న్యూజిలాండ్ స్కోరు 94/8
19వ ఓవర్లో న్యూజిలాండ్కు 11 పరుగులు లభించాయి. శివం మావి బౌలింగ్ లో ఒక ఫోర్, ఐదు సింగిల్స్ , రెండు వైడ్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో డఫ్ఫీ(15), సాంట్నర్ (12) పరుగులతో ఉన్నారు.
18వ ఓవర్ :ఇష్ సోదీ (0), ఫెర్గ్యూసన్ (0) ఔట్ , న్యూజిలాండ్ స్కోరు 87/8
రెండో టీ20లో కివీస్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 83 పరుగుల వద్ద ఇష్ సోధీ (0), ఫెర్గ్యూసన్ (0) ఔటయ్యారు. అటు 18వ ఓవర్లో న్యూజిలాండ్కు 3 పరుగులే లభించాయి. అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్లో మూడు సింగిల్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో డఫ్ఫీ(0), సాంట్నర్ (12) పరుగులతో ఉన్నారు.
17వ ఓవర్ : బ్రేస్ వెల్ (14) ఔట్ , న్యూజిలాండ్ స్కోరు 80/6
రెండో టీ20లో కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది. 80 పరుగుల వద్ద బ్రేస్ వెల్ (14) పెవీలియన్ చేరాడు. అటు 17వ ఓవర్లో న్యూజిలాండ్కు 4 పరుగులే లభించాయి. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో నాలుగు సింగిల్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో ఇష్ సోదీ(0), సాంట్నర్ (10) పరుగులతో ఉన్నారు.
16వ ఓవర్ : న్యూజిలాండ్ స్కోరు 76/5
16వ ఓవర్లో న్యూజిలాండ్ కు 5 పరుగులే లభించాయి. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఐదు సింగిల్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో బ్రేస్ వెల్ (12), సాంట్నర్ (8) పరుగులతో ఉన్నారు.
15వ ఓవర్ : న్యూజిలాండ్ స్కోరు 71/5
15వ ఓవర్లో న్యూజిలాండ్ కు 5 పరుగులే లభించాయి. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో వైడ్, మూడు సింగిల్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో బ్రేస్ వెల్ (9), సాంట్నర్ (6) పరుగులతో ఉన్నారు.
14వ ఓవర్ : న్యూజిలాండ్ స్కోరు 67/5
14వ ఓవర్లో న్యూజిలాండ్ కు 5 పరుగులే లభించాయి. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో ఒక ఫోర్, ఒక సింగిల్ వచ్చింది. ప్రస్తుతం క్రీజులో బ్రేస్ వెల్ (7), సాంట్నర్ (5) పరుగులతో ఉన్నారు.
13వ ఓవర్ : చాప్ మన్ (14) ఔట్, న్యూజిలాండ్ స్కోరు 60/5
రెండో టీ20లో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. దీపక్ హుడా బౌలింగ్ లో చాప్ మన్ (14) రనౌట్ అయ్యాడు. దీంతో 60 పరుగులకే కివీస్ సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అటు 13వ ఓవర్లో న్యూజిలాండ్ కు 4 పరుగులే లభించాయి. దీపక్ హుడా నాలుగు సింగిల్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో బ్రేస్ వెల్ (6), సాంట్నర్ (1) పరుగులతో ఉన్నారు.
12వ ఓవర్ : న్యూజిలాండ్ స్కోరు 58/4
12వ ఓవర్లో న్యూజిలాండ్ కు 4 పరుగులే లభించాయి. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో నాలుగు సింగిల్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో బ్రేస్ వెల్ (5), మార్క్ చాప్ మన్ (12) పరుగులతో ఉన్నారు.
11వ ఓవర్ : న్యూజిలాండ్ స్కోరు 54/4
11వ ఓవర్లో న్యూజిలాండ్ కు 6 పరుగులే లభించాయి. దీపక్ హుడా బౌలింగ్లో నాలుగు సింగిల్స్, ఒక టుడీ వచ్చింది. ప్రస్తుతం క్రీజులో బ్రేస్ వెల్ (2), మార్క్ చాప్ మన్ (11) పరుగులతో ఉన్నారు.
10వ ఓవర్ : డార్లీ మిచెల్ (8) ఔట్, న్యూజిలాండ్ స్కోరు 48/4
రెండో టీ20లో న్యూజిలాండ్ నాల్గో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో మిచెల్ (8) బౌల్డ్ అయ్యాడు. దీంతో కివీస్ 48 పరుగుల వద్దే నాల్గో వికెట్ కోల్పోయింది. ఇక మొత్తంగా 10వ ఓవర్లో న్యూజిలాండ్ కు 3 పరుగులే లభించాయి. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో మూడు సింగిల్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో బ్రేస్ వెల్ (1), మార్క్ చాప్ మన్ (11) పరుగులతో ఉన్నారు.
9వ ఓవర్ : న్యూజిలాండ్ స్కోరు 45/3
9వ ఓవర్లో న్యూజిలాండ్ కు 5 పరుగులే లభించాయి. దీపక్ హుడా బౌలింగ్లో మూడు సింగిల్స్ , ఒక టుడీ వచ్చింది. ప్రస్తుతం క్రీజులో డార్లీ మిచెల్ (5), మార్క్ చాప్ మన్ (5) పరుగులతో ఉన్నారు.
8వ ఓవర్ : న్యూజిలాండ్ స్కోరు 40/3
8వ ఓవర్లో న్యూజిలాండ్ కు 5 పరుగులే లభించాయి. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఒక ఫోర్ వచ్చింది. ప్రస్తుతం క్రీజులో డార్లీ మిచెల్ (2), మార్క్ చాప్ మన్ (3) పరుగులతో ఉన్నారు.
7వ ఓవర్ : గ్లెన్ ఫిలిప్స్ (5) ఔట్, న్యూజిలాండ్ స్కోరు 35/3
రెండో టీ20లో కివీస్ మూడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్ దీపక్ హుడా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఇక 7వ ఓవర్లో న్యూజిలాండ్ కు 2 పరుగులే లభించాయి. హుడా బౌలింగ్లో రెండు సింగిల్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో డార్లీ మిచెల్ (0), మార్క్ చాప్ మన్ (3) పరుగులతో ఉన్నారు.
6వ ఓవర్ : న్యూజిలాండ్ స్కోరు 33/2
6వ ఓవర్లో న్యూజిలాండ్ కు 4 పరుగులు లభించాయి. చాహల్ బౌలింగ్లో వైడ్ తో పాటు..సింగిల్, టుడితో కలిపి మొత్తం 4 పరుగులొచ్చాయి. ప్రస్తుతం క్రీజులో గ్లెన్ ఫిలిప్స్ (4), మార్క్ చాప్ మన్ (1) పరుగులతో ఉన్నారు.
5వ ఓవర్ : డివాన్ కాన్వే (11 )ఔట్, న్యూజిలాండ్ స్కోరు 29/2
రెండో టీ20లో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో డివాన్ కాన్వే(11) ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో కివీస్ 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇక 5వ ఓవర్లో న్యూజిలాండ్ కు 8 పరుగులు లభించాయి. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో మొత్తం 6 పరుగులొచ్చాయి. ప్రస్తుతం క్రీజులో గ్లెన్ ఫిలిప్స్ (1), మార్క్ చాప్ మన్ (1) పరుగులతో ఉన్నారు.
తొలి టీ20లో ఓటమిపాలైన టీమిండియా రెండో మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీ20 కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాక ఒక్క సిరీస్ కూడా భారత్ ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో రెండో టీ20లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఆడుతోంది. మరోవైపు వన్డే సిరీస్ చేజార్చుకున్న న్యూజిలాండ్ టీ20 సిరీస్ అయినా గెలవాలని ప్లాన్ పట్టుదలతో ఉంది. రెండో మ్యాచులోనూ రోహిత్ సేనను ఓడించి ట్రోఫీ ఎగరేసుకుపోవాలని ఆడుతోంది.
టీమిండియా తుది జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, చాహల్ , అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ తుది జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్ , మైఖేల్ బ్రేస్‌వెల్, జాకబ్ డఫీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.