చమురు మంటల భయం.. మార్కెట్లు డౌన్

చమురు మంటల భయం.. మార్కెట్లు డౌన్

అక్టోబరు నెల తొలి(సోమవారం)  ట్రేడింగ్ సెషన్ లో స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఆరంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లను, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లను కోల్పోయింది. చమురు సంస్థలు ఉత్పత్తిని తగ్గించే అవకాశాలున్నాయనే ఆందోళనలతో క్రూడ్ ఆయిల్ ధరలు కొంతమేర పెరిగాయి. ద్రవ్యోల్బణం రేట్లు కూడా అంతకంతకూ పెరుగుతుండటంతో పాటు కరెన్సీ మార్కెట్లలో ఆకస్మిక కదలికలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో స్ట్రెయిట్ టైమ్స్ (సింగపూర్), హాంగ్ సెంగ్ (హాంకాంగ్), ఎస్జీఎక్స్ నిఫ్టీ (సింగపూర్), జకార్తా కంపోజిట్ (ఇండోనేషియా), షాంఘై కంపోజిట్ (చైనా) సహా పలు ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు రెడ్ జోన్ లో కదలాడాయి. వాటి బాటలోనే ఇండియా స్టాక్ మార్కెట్లు కూడా నడిచాయి. ఈక్రమంలో సెన్సెక్స్, నిఫ్టీలో నష్టాల పరంపర ఇవాళ కూడా  కొనసాగింది.  ఉదయం 9 గంటల 46 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 344 పాయింట్లు  నష్టపోయి 16,989 పాయింట్లకు చేరగా, నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 17,026 పాయింట్లకు చేరింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 188 పాయింట్లు నష్టపోయి 38,443 పాయింట్ల వద్ద కదలాడుతోంది. 

టాప్ గెయినర్స్ :  ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్, దివీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, సిప్లా, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, సన్ ఫార్మా, అల్ట్రా టెక్ సిమెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 

టాప్ లూజర్స్ : హిండాల్కో, కోటక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, నెస్లే, టైటాన్ కంపెనీ, బ్రిటానియా, ఎల్ అండ్ టీ, టాటా కన్సూమర్ ప్రోడక్ట్స్, ఎస్బీఐ లైఫ్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, జేఎస్ డబ్ల్యు స్టీల్, ఐటీసీ, టాటా స్టీల్.