ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. నాల్గవ రోజు కూడా ప్రీతి ఆరోగ్యం క్రిటికల్ కండిషన్ లోనే ఉందని తెలిపారు. ఏక్మో, వెంటిలేటర్, డయాలసిస్ మిషన్స్ తో చికిత్స అందిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ప్రీతికి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
సీనియర్ వైద్యవిద్యార్థి సైఫ్ వేధింపుల వల్ల ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని శుక్రవారం వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. నిందితుడు సైఫ్ ను పోలీసులు హనుమకొండ జిల్లా వరంగల్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత సైఫ్ ను ఖమ్మం జైలుకు తరలించనున్నారు.
