అంతా సవ్యంగా జరిగితే.. ఇప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. ఈసారి పక్కాగా విజయ్ సీఎం కావటం ఖాయం. ఎందుకు అంటారా.. VCK పార్టీ అధికారికంగా తన మద్దతు తెలుపుతూ లేఖ అందజేసింది. తన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి మరీ లేఖ అందజేశారు ఆ పార్టీ చీఫ్ తిరుమావళవన్. ఈ లేఖను విజయ్ పార్టీకి చెందిన ఆదవ అర్జున్ కు అందజేశారు.
విజయ్ పార్టీ మద్దతు అంకెలు చూస్తే..
- టీవీకే పార్టీ 107
- కాంగ్రెస్ ఐదుగురు
- సీపీఎం ఇద్దరు
- సీపీఐ ఇద్దరు
- వీసీకే పార్టీ ఇద్దరు
మొత్తంగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మ్యాజిక్ ఫిగర్ 118కి సరిపోయింది. గత మూడు మీటింగ్స్ లో గవర్నర్ ఇదే చెప్పారు.. 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రండి.. ప్రమాణ స్వీకారం చేయండి అని.. ఫస్ట్ టైం కాంగ్రెస్ మద్దతులో వెళ్లిన విజయ్.. ఆ తర్వాత కామ్రేడ్ల మద్దతుతో వెళ్లారు. మధ్యలో ఓ మీటింగ్ జరిగినా.. అప్పుడు మద్దతు లేఖ అంశం ప్రస్తావనకు రాలేదు.నిన్నటికి నిన్న సీపీఎం, సీపీఐ పార్టీలు లేఖలు ఇచ్చినా.. చివరి నిమిషంలో వీసీకే పార్టీ అడ్డం తిరిగింది.24 గంటల హైడ్రామా తర్వాత.. సుదీర్ఘ చర్చల తర్వాత.. వీసీకే పార్టీ అధికారికంగా లేఖ అందజేసింది.
దీంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటానికి విజయ్ కు లైన్ క్లియర్ అయ్యింది. విజయ్ అనే నేను అనే మాటలు మాత్రమే ఇప్పుడు టీవీకే అభిమానుల మెదళ్ల్లో ఉన్నాయి. ఈ మాట ఎప్పుడు అంటాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
Tamil Nadu | VCK extends unconditional support to TVK to form a government in the state.
— ANI (@ANI) May 9, 2026
With this, TVK now has the support of Congress, CPI, CPI(M) and VCK, taking its tally to 119, crossing the majority mark of 118. pic.twitter.com/iWK69ncqHq
