తమిళనాడులో ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని చేరుకోవడంలో విజయ్ టీవీకే పార్టీకి ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి. మే 9న వీసీకే , IUML పార్టీలు విజయ్ TVKకి బేషరతు మద్దతు ప్రకటించడంతో ఎమ్మెల్యేల సంఖ్య 120కి చేరింది. గవర్నర్ అపాయింట్ మెంట్ ఇస్తే విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయినట్టే.
తమిళనాడులో డీఎంకే , అన్నాడీఎంకేలను వెనక్కి నెట్టి 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. విజయ్ గెలిచిన రెండు సీట్లలో ఒకదానిని వదులుకోవడంతో TVK బలం 107కి చేరినప్పటికీ... ఇప్పుడు VCK, IUML పార్టీల చెరో రెండు సీట్ల మద్దతుతో విజయ్ బలం 120కి చేరుకుంది.
విజయ్ కు మద్దతిచ్చే పార్టీలు
- టీవీకే పార్టీ: 107
- కాంగ్రెస్ : 5
- సీపీఎం: 2
- సీపీఐ: 2
- వీసీకే: 2
- ఐయూఎంఎల్: 2
గవర్నర్‌తో మూడు విడతలుగా జరిగిన చర్చలు సఫలమయ్యాయి. మెజారిటీ నిరూపించుకోవడంలో మొదట ఇబ్బందులు ఎదురైనా తాజా పరిణామాలతో తమిళనాడులో విజయ్ శకం అధికారికంగా ప్రారంభం కానుంది. కోట్లాది మంది అభిమానుల కల నెరవేరుతూ... తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు దళపతి సిద్ధమయ్యారు.
