తమిళనాడులో అంతా సెట్ అయిపోయింది. 118 మంది సంతకాలతో లేఖలు రెడీ. ఇక గవర్నర్ పిలుపు మాత్రమే వెయిటింగ్. సాయంత్రం 5 గంటల సమయానికి విజయ్ కు కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించేసింది. ఇక కలవాల్సింది గవర్నర్ అర్లేకర్ ను.
ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. గవర్నర్ తన షెడ్యూల్ ప్రకారం ఈ రాత్రి 7 గంటలకు కేరళ వెళ్లనున్నారు. రాత్రి 7 గంటలకు బయలుదేరి తిరువనంతపురం వెళ్లనున్నట్లు లోక్ భవన్ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ అర్లేకర్ కేరళ రాష్ట్రం గవర్నర్ కూడా ఉన్నారు. అక్కడ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కేరళ షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు.
రాత్రి 7 గంటలలోపు గవర్నర్ అర్లేకర్ తన అపాయింట్ మెంట్ విజయ్ కు ఇస్తారా లేదా.. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇస్తారా లేదా.. ముహూర్తం ఫిక్స్ చేస్తారా లేదా.. ప్రభుత్వ సీఎస్, డీజీపీకి ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేస్తారా లేదా అనేది అందరిలో ఆసక్తిగా మారింది.
ఇప్పటికే రెండు సార్లు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేస్తూ వెనక్కి తగ్గారు అధికారులు. ఈసారి గవర్నర్ ఆదేశాల తర్వాతనే ఏర్పాట్ల ప్రక్రియ ప్రారంభించబోతున్నారనే వార్తలు అధికార వర్గాల నుంచి వస్తున్నాయి.
