RR vs GT: ప్లే ఆఫ్ క్లాష్.. గెలిచేదెవరు..? పింక్ ప్రామిస్ మ్యాచ్లో రాజస్థాన్ కొట్టే సిక్సులెన్ని..?

RR vs GT: ప్లే ఆఫ్ క్లాష్.. గెలిచేదెవరు..? పింక్ ప్రామిస్ మ్యాచ్లో రాజస్థాన్ కొట్టే సిక్సులెన్ని..?

ఐపీఎల్ 2026 లో భాగంగా మే 09 (శనివారం) రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది. వరుసగామూడు గెలుపులతో కాన్ఫిడెన్స్ తో దండయాత్రకు బయల్దేరింది గుజరాత్ టీమ్. అదే క్రమంలో గత ఓటములనుంచి కోలుకుని.. టాప్ 4 స్థానాన్ని పదిలం చేసుకునేందుకు సిద్ధమైంది గుజరాత్. దీంతో రెండు టీమ్స్ మధ్య వార్ గట్టిగానే నడిచేలా ఉంది.

మరో విషయం ఏంటంటే.. రాజస్థాన్ రాయల్స్ కు ఇది పింక్ ప్రామిస్ మ్యాచ్. అంటే పూర్తి పింక్ కలర్ జెర్సీలతో సందడి చేయనున్నారు. ఈ థీమ్ ఉద్దేశం ఏంటంటే.. ఎన్ని సిక్సులు కొడితే అన్ని.. ఆరు రెట్లు ఇండ్లకు సోలార్ లైటింగ్ సదుపాయం కల్పించడం. అంటే ఒక్క సిక్సుకు ఆరు ఇండ్లకు సోలర్ పవర్ సౌకర్యం కల్పించనున్నారు. దీంతో రాత్రికి కొట్టే సిక్సులపై కౌంటింగ్ మామూలుగా ఉండదు.

పింక్ ప్రామిస్ మ్యాచ్ ఇది మూడో ఏడు. 2026లో 260 ఇళ్లు సోలార్ తో వెలిగాయి. 2025లో సాంబార్ ప్రాంతంలోని 520 ఇండ్లకు సౌర విద్యుత్ వెలుగులు అందించారు. ఈ ఏడు అంతకు మించిన సిక్సులు పడతాయని ఊహిస్తున్నారు ఫ్యాన్స్.

రాజస్థాన్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ ను దెబ్బకొట్టి  తమ టాప్-ఫోర్ స్థానాన్ని కాపాడుకోవాలని రాజస్థాన్ రాయల్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 52వ మ్యాచ్‌కు ఇరు జట్లు 12 పాయింట్లతో సమంగా ఉన్నాయి. దీంతో ప్లేఆఫ్ అర్హత కోసం ఈ పోరు రసవత్తరంగా ఉండనుంది.  రాజస్థాన్  ఇటీవల ఢిల్లీ చేతిలో ఓటమి చవిచూడగా, గుజరాత్..  వరుసగా మూడు మ్యాచ్‌ల విజయ పరంపరతో జైపూర్‌కు వస్తోంది.

లాస్ట్ మ్యాచ్‌లో 90 రన్స్ తో  వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన  కెప్టెన్ రియాన్ పరాగ్ ఫామ్ లోకి రావటం ఆర్ఆర్ కు కలిసొచ్చే అంశం.   జాసన్ హోల్డర్ నేతృత్వంలోని గుజరాత్ బౌలింగ్ .. మహమ్మద్ సిరాజ్ స్పీడ్ ముందు పరాగ్  నాయకత్వానికి గట్టి పరీక్ష ఎదురుకానుంది. పవర్‌ప్లే ఓవర్లలో  వేగంగా పరుగులు పిండుకోవడానికి రాయల్స్ తమ యువ ఓపెనింగ్ జోడి యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలపై ఎక్కువగా ఆధారపడనుంది.