తెలంగాణలో ‘వన్‌‌‌‌ నేషన్‌‌‌‌ వన్‌‌‌‌ రేషన్‌‌‌‌ కార్డు’ సక్సెస్

తెలంగాణలో ‘వన్‌‌‌‌ నేషన్‌‌‌‌ వన్‌‌‌‌ రేషన్‌‌‌‌ కార్డు’ సక్సెస్
  • లోక్‌‌‌‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ వ్యాప్తంగా ‘వన్‌‌‌‌ నేషన్‌‌‌‌ వన్‌‌‌‌ రేషన్‌‌‌‌ కార్డ్‌‌‌‌’ పథకం విజయవంతంగా అమలవుతున్నదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల ముఖ్యంగా బొగ్గు గని కార్మికులు, థర్మల్ విద్యుత్ కార్మికులు దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ పొందే వెసులుబాటు కలిగిందని పేర్కొంది.

 ఈ మేరకు బుధవారం పార్లమెంటులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి నిముబెన్‌‌‌‌ జయంతిభాయ్‌‌‌‌ బంభానియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ కింద మొత్తం 410 చౌక ధరల దుకాణాలు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు.