దేశంలో మండుతున్న ఎండలు

దేశంలో మండుతున్న ఎండలు

దేశంలో ఎండలు మండిపోతున్నాయి.ఇళ్ల నుంచి జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.పొద్దుగాల 8 గంటల నుంచే సూర్యుడు సుర్రు మంటున్నాడు.దేశంలో పలుప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఎండవేడిమికి తోడు వడగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.మరోవైపు ధోలాపూర్ లో ఇవాళ అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జమ్ము కశ్మీర్, పంజాబ్,హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలో ఏప్రిల్ నెలలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది 1973, 2010,2016లో మాత్రమే. నిజానికి దేశంలో 2010లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని రోజులు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని ఐఎండీ అధికారులు చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

స్కూల్స్ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలి

రైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి