4 నెలల గరిష్టానికి ట్రేడ్ డెఫిసిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

4 నెలల గరిష్టానికి ట్రేడ్ డెఫిసిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 34.99 బిలియన్ డాలర్లకు గూడ్స్ ఎగుమతులు 

న్యూఢిల్లీ : గూడ్స్ ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 34.99 బిలియన్ డాలర్లకు పెరిగాయి. కిందటేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  చేసిన సరుకుల ఎగుమతులతో పోలిస్తే ఒక శాతం వృద్ధి చెందాయి.  మరోవైపు  దిగుమతులు 10.25 శాతం పెరిగి 54.09 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫలితంగా ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ట్రేడ్ డెఫిసిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (దిగుమతులు మైనస్ ఎగుమతులు)  19.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది 4 నెలల గరిష్టానికి సమానం. కిందటేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రేడ్ డెఫిసిట్ 14.44 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెట్రోలియం ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫార్మా సెక్టార్లలో   ఎగుమతులు పుంజుకున్నాయి. ప్రీషియస్ మెటల్స్ దిగుమతులు రెండింతలు పెరిగి 3.11 బిలియన్ డాలర్లకు, క్రూడాయిల్ దిగుమతులు 20.22 శాతం (ఇయర్ ఆన్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పెరిగి 16.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.  2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశ గూడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగుమతులు మొత్తం 778.21 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని కామర్స్ సెక్రెటరీ సునిల్ బర్త్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు.

ఇందులో సరుకుల ఎగుమతుల వాటా 437.1 బిలియన్ డాలర్లుగా, సర్వీసెస్ సెక్టార్ ఎగుమతుల వాటా 341.1 బిలియన్ డాలర్లుగా ఉంది. కామర్స్ మినిస్ట్రీ డేటా ప్రకారం, కిందటి నెలలో సర్వీసెస్ సెక్టార్ ఎగుమతులు 29.57 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. కిందటేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ ఎగుమతులు 25.78 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సర్వీసెస్ సెక్టార్ దిగుమతులు 13.96 బిలియన్ డాలర్ల నుంచి 16.97 బిలియన్ డాలర్లకు పెరిగాయి.