ఎన్​సీసీ లాభం రూ.239 కోట్లు

ఎన్​సీసీ లాభం రూ.239 కోట్లు

హైదరాబాద్​, వెలుగు : ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎన్​సీసీ లిమిటెడ్​కు మార్చి క్వార్టర్​లో  నికర లాభం (కన్సాలిడేటెడ్​) సంవత్సరానికి 25 శాతం పెరిగి రూ.239.2 కోట్లుగా నమోదయింది. 2022–-23లో కంపెనీ రికార్డ్ స్థాయిలో ఆర్డర్లు దక్కించుకోవడంతో ఆదాయం 31 శాతం పెరిగి రూ. 6,484.9 కోట్లకు చేరుకుందని ఎన్​సీసీ  తెలిపింది.

2022–-23లో నేషనల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐపి) కింద ప్రభుత్వం చేసిన అధిక వ్యయంతో ఎన్​సీసీ తన అత్యధిక ఆర్డర్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో రూ. 26 వేల కోట్ల మార్క్​ను అందుకుంది.