తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా.!

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా.!

హైదరాబాద్, వెలుగు: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించే ఆలోచనతో సీఎం రేవంత్ ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను ఈ వేడుకలకు ఆహ్వానిస్తే.. రాష్ట్ర ప్రజల తరఫున ఆమెకు తగిన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఏఐసీసీ నేతల దృష్టికి సీఎం తీసుకెళ్లినట్టు సమాచారం. త్వరలోనే సోనియా టూర్​పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు.