భారతీయులు అన్నా.. ఇక్కడి సంప్రదాయాలన్నా విదేశీయులకు ఎంత మక్కువో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ మక్కువ మన దేశానికి విదేశీ ఇల్లరికపు కోడళ్లను తీసుకొస్తోంది. రాను రాను భారతీయులను పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తున్న విదేశీ వనితల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రేమించిన వాడిని పెళ్లాడటానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరాన్ని సైతం వారు లెక్క చేయడం లేదు. తాజగా ఓ ఆస్ట్రేలియన్ వనిత.. భారతీయుణ్ని పెళ్లి చేసుకొని తెగ మురిసిపోయింది.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రి నగర్ కాలనీకి చెందిన సదానందం, పద్మ దంపతుల కుమారుడు కార్తీక్ చదువుల నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. అక్కడ హనా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కార్తీక్ సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేయగా, హన సైంటిస్టుగా పనిచేస్తోంది.
కాలం గడిచే కొద్దీ వీరి మధ్య పరిచయం.. ప్రేమకు దారితీసింది. ఆ విషయాన్ని వీరిరువురు పెద్దలకు తెలియజేసి.. వారి అంగీకారంతో నేడు(ఆగష్టు 20) నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిటీ ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో వేద పండితులు మంత్రోత్సవాలు నడుమ వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. విదేశీ పెల్లుకూతురిని చూడటానికి పెళ్లి కుమారుడి తరుపు బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
