V6 News

ఈ నెల 27న నీతి ఆయోగ్ 8వ పాలక మండలి మీటింగ్

ఈ నెల 27న నీతి ఆయోగ్ 8వ పాలక మండలి మీటింగ్

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ నెల 27న నీతి ఆయోగ్ 8వ పాలక మండలి మీటింగ్​ జరుగనుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ న్యూ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించనున్న భేటీకి పలు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్లుగా కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ సభ్యులు హాజరుకానున్నారు. ‘వికసిత్ భారత్ @ 2047 : టీం ఇండియా పాత్ర’ థీమ్​తో ఈ భేటీ  నిర్వహించనున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది.

ఇందులో  వికసిత్  భారత్, ఎంఎస్ఎంఈలపై ఒత్తిడి, మౌలిక సదుపాయాలు– పెట్టుబడు లు, మహిళా సాధికారత తదితర 8 అంశాలపై చర్చింను న్నట్లు పేర్కొంది. ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అత్యధిక జనాభా కలిగిన ఇండియాకు ఈ పాలక మండలి మీటింగ్ రాబోయే 25 ఏండ్లలో వేగవంతమైన వృద్ధిని సాధించగలదని పేర్కొంది.