
హైదరాబాద్: హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిని విస్తరిస్తామని.. ఆ హైవేను 4 లేన్లుగా మార్చుతామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సోమవారం (మే 5) తెలంగాణలో పర్యటించిన గడ్కరీ.. అంబర్ పేట ఫ్లై ఓవర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో హైవేలను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. సర్వీసు రోడ్లు, ఫుట్ పాత్లు కూడా నిర్మిస్తున్నామని చెప్పారు.
అంతకుముందు.. బీహెచ్ఈఎల్ చౌరస్తా ఫ్లైఓవర్ను ఆయన ప్రారంభించారు. ఫ్లై ఓవర్ను ప్రారంభించిన గడ్కరీ జాతికి అంకితం చేశారు. ఫ్లై ఓవర్ పొడవునా ‘‘ఫ్లై ఓవర్ ఆఫ్ ది మెన్ నితిన్ గడ్కరీ’’ అంటూ ఫ్లెక్సీలు కనిపించాయి. 172 కోట్ల రూపాయల వ్యయంతో 6 లేన్లుగా 1.6 కిలో మీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగింది.