ప్రమాదవశాత్తు బావిలో పడ్డ కొడుకు.. కొడుకు కనిపించడం లేదని అదే బావిలో దూకి తండ్రి ఆత్మహత్య

 ప్రమాదవశాత్తు బావిలో పడ్డ కొడుకు.. కొడుకు కనిపించడం లేదని అదే బావిలో దూకి తండ్రి ఆత్మహత్య

షాద్ నగర్, వెలుగు: ప్రమాద వశాత్తు కొడుకు బావిలో పడిపోగా, కొడుకు కనిపించకపోవడంతో మనస్తాపం చెంది అదే బావిలో దూకి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలం హాజీపల్లి గ్రామానికి చెందిన తూర్పటి యాదయ్య(40) సంతాపూర్ గ్రామంలోని రఫీక్  వ్యవసాయ పొలంలో కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. యాదయ్య కొడుకు కన్నయ్య(11) ఈ నెల 4 నుంచి కనిపించకుండా పోయాడు.

చుట్టు పక్కల వెతికినా కనిపించకపోవడంతో 5న కేశంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కొడుకు కనిపించడం లేదనే ఆవేదనతో సోమవారం మధ్యాహ్నం యాదయ్య బావిలో దూకి సూసైడ్​ చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది సాయంతో గాలించగా తండ్రి యాదయ్యతో పాటు అతని కొడుకు కన్నయ్య డెడ్​బాడీలు బయటపడ్డాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు