సరిహద్దుల్లో నిఘా పెంచాలి : నిజామాబాద్ సీపీ సాయి చైతన్య 

సరిహద్దుల్లో నిఘా పెంచాలి : నిజామాబాద్ సీపీ సాయి చైతన్య 

బోధన్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం బోధన్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. పట్టణంలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అదనపు బలగాలను మోహరించాలన్నారు.

తెలంగాణ-– మహారాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, పట్టణ, రూరల్ సీఐలు వెంకటనారాయణ, విజయబాబులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్మూర్ : ఆర్మూర్, భీంగల్​ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాట్లు చేయాలని పోలీస్​ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు.  మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్ డివిజన్ పరిధిలో బందోబస్తు ఏర్పాట్లపై సోమవారం ఆర్మూర్ ఏసీపీ ఆఫీస్​ లో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల రూల్స్​ను   తప్పకుండా పాటించాలని అన్నారు.