ఇందూర్ లో జాబ్ మేళా.. 2 వేల మందికి కొలువులు

ఇందూర్ లో జాబ్ మేళా.. 2 వేల మందికి కొలువులు

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లా యూత్​కోసం గురువారం నిజామాబాద్​నగరంలోని శ్రీరామాగార్డెన్​లో నిర్వహించిన జాబ్​మేళాకు విశేష స్పందన లభించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా టాస్క్​ సౌజన్యంతో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాబ్​మేళా ఏర్పాటు చేయగా కలెక్టర్​ఇలా త్రిపాఠి, రూరల్​ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రారంభించారు. సుమారు 4 వేల మంది యువత మేళాకు తరలిరాగా వారిలో అర్హతలను బట్టి 71 కంపెనీలు 2 వేల మందికి జాబ్స్​ఇచ్చాయి. 

టెన్త్​మొదలుకొని అపై విద్యార్హతలు ఉన్న వారి కోసం విడివిడిగా కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేసి సెలెక్ట్​ చేసుకున్నారు. జాబ్స్​పొందిన యూత్​కు కలెక్టర్, ఎమ్మెల్యే నియామక పత్రాలు అందజేశారు. ఉర్దూ అకాడెమీ చైర్మన్​తాహెర్, అడిషనల్ కలెక్టర్​దిలీప్​కుమార్, మార్కెట్​కమిటీ చైర్మన్​ముప్ప గంగారెడ్డి, డీవైఎస్​వో పవన్​కుమార్, జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్​సురేశ్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు.