ఇండోర్ స్టేడియం ఎప్పుడు పూర్తయ్యేనో?

ఇండోర్ స్టేడియం ఎప్పుడు పూర్తయ్యేనో?

కేపీహెచ్ బీ కాలనీ, వెలుగు: కేపీహెచ్ బీకాలనీలో ప్రజల కోసం నిర్మిస్తున్నఇండోర్ స్విమ్మింగ్ ఫూల్, ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.సంవత్సరంలోపు నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నా పనుల్లో జాప్యం చేయడంతో మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కూకట్ పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్ బీ కాలనీ ఆరో ఫేజ్ లో వివేకానంద గ్రౌండ్లో రూ.4 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియంతో పాటు స్విమ్మింగ్ ఫూల్ నిర్మించేందుకు 2016 ఫిబ్రవరిలో జీహెచ్ ఎంసీ అధికారులు పనులను ప్రారంభించారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్ పనులను నత్తనడకన సాగిస్తూ వచ్చారు . దీంతో సంవత్సరంలోపు పూర్తి కావాల్సిన పనులు మూడు సంవత్సరాలు అయినా ఇంకా పూర్తి కాలేదు.ఎక్కడి పనులు అక్కడే మొదటి అంతస్తులో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నిర్మాణ పనులను పూర్తి చేయడంతో తీవ్ర జాప్యం జరుగుతుంది. కాలనీ ప్రజలు అడుకునేందుకు మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి. స్టేడియం పనుల్లో భాగంగా టాయి లెట్స్ ​పనులుపూర్తి చేయకుండా అలాగే వదిలేశారు. కరెంటు వైర్లను ఎక్కడికక్కడ వేలాడదీసి ఉంచడంతో ప్రమాదకరంగా మారుతున్నాయి.

త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం

ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను ఈనెల 31వ తేదీ వరకు పూర్తి చేసేలా అన్నిఏర్పాట్లు  చేస్తు న్నాం . పనుల్లో యంత్రాల బిగింపు పనులు అలస్యం చేయడం వలన నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. స్టేడియం పనుల్లో భాగంగా విద్యుత్ బిగింపు పనులను, షటిల్ కోర్టులో పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. -డీ ఈ శ్రీకాం త్‌