
హైదరాబాద్ సిటీలో భారీగా ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. 147 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ CP CV ఆనంద్ ఆదేశాలు జారీచేశారు. అలాగే చాలా పోలీస్ స్టేషన్ లకు కొత్త ఇన్స్పెక్టర్లను నియమించారు సీపీ సీవీ ఆనంద్.
42 పోలీస్ స్టేషన్లకు కొత్త ఇన్స్పెక్టర్లను నియమించారు. చాలా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్లను బదిలీ చేయగా కొత్త వాళ్ళను నియమించారు.అంతేగాకుండా పలు పోలీస్ స్టేషన్ల పేరు మార్చారు. హుయాయునగర్ పీఎస్ ను మోహదీపట్నం పీఎస్ గా, షాహినాయత్ గంజ్ పీఎస్ ను గోషామహల్ పీఎస్ గా మార్చినట్లు తెలిపారు.
►ALSO READ | కులగణనలో తెలంగాణ రోల్ మోడల్: రాహుల్ గాంధీ