హైదరాబాద్‌సిటీ, వెలుగు : బాలచెలిమి జాతీయ బాలల కథల పురస్కారాలు–2025 కార్యక్రమాన్ని ఆదివారం హిమాయత్‌నగర్ లోని ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా బాలసాహిత్యానికి సేవలందిస్తున్న యువ కథాకారులు, రచయితలను సత్కరించారు. పెద్దలు, యువత, స్టూడెంట్స్కథల కేటగిరీల్లో పోటీలు నిర్వహించి 36 మంది విజేతలకు పురస్కారాలు ప్రదానం చేశారు.
మణికొండ వేదకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌రియాజ్, బాలచెలిమి కన్వీనర్గరిపల్లె అశోక్, ఏపీ గ్రంథాలయ చైర్మన్డాక్టర్రావి శారద, చిత్రకారులు కూరెళ్ల శ్రీనివాస్, ధనుంజయ, మాడభూషి లలితాదేవి, కొమ్మవరవు కృష్ణమ, ప్రవీణ్ శర్మ, పైడిమర్రి గిరిజ, అమ్మిన శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
