బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షుడిగా టీసీ.రాథోడ్

బంజారా సేవా సంఘ్  జాతీయ అధ్యక్షుడిగా టీసీ.రాథోడ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆలిండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షుడిగా టీసీ.రాథోడ్, రాష్ట్ర అధ్యక్షుడిగా రిటైర్డ్ ఇంజినీర్ ఆర్.మోహన్ సింగ్ ఎన్నికయ్యారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్ లో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ.. గిరిజనుల హక్కుల రక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్‌‌‌‌ ఏర్పాటు చేయాలన్నారు. బంజారా సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని కోరారు. 

తండాల్లో సేవా సంఘ్ కమిటీలను ఏర్పాటు చేసి యువతను భాగస్వామ్యం చేస్తామన్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఫిబ్రవరి 15ను జాతీయ సెలవు దినంగా ప్రకటించి అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఏపీ మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, జాతీయ కార్యవర్గ సభ్యుడు, సౌత్ ఇండియా అధ్యక్షుడు సరోజ బాయ్, జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తారాచంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.