
- కోర్ సిటీలో పాత ఫ్లాట్లకు నో డిమాండ్..భారీగా ఫర్ సేల్ బోర్డులు
- ప్రధాన ప్రాంతాల్లోనూ భారీగా ఫర్ సేల్ బోర్డులు
- ఎస్ఎఫ్టీ రూ. 4000 కు కూడా కొంటలేరు
- కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలే కారణం
- బేగం బజార్ లో డిఫరెంట్ పరిస్థితి
- అక్కడ చదరపు గజం రూ. 10 లక్షలు
హైదరాబాద్: ట్రాఫిక్ పరేషాన్..కాలుష్యం..హైదరాబాద్ ను పరేషాన్ చేస్తున్నాయి. దీంతో చాలా మంది సిటీ వీడి ఔటర్ వైపు ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లిపోతున్నారు.పశ్చిమాన మేడ్చల్ దాటాక కూడా కొత్త నిర్మాణాలు అక్కడే విల్లాలు, ఫ్లాట్లు కొనుక్కొంటున్నారు. ప్రధాన ప్రాంతాల్లోని పాత ఫ్లాట్లు అమ్మకానికి పెట్టినా కొనే వారే కరువయ్యారు.
చదరపు అడుగు రూ. 4 వేలకు కూడా అమ్ముడుపోని పరిస్థితి నెలకొంది. నగరంలోని హిమాయత్ నగర్,చిక్కడపల్లి, ముషీరాబాద్, అశోక్ నగర్, రాంనగర్, నారాయణగూడ, కాచిగూడ, తార్నాక, మెహదీపట్నం, బేగంపేట, సికింద్రాబాద్, నిజాంపేట, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో పాత ఫ్లాట్ల అమ్ముతామంటూ బోర్డులు పెట్టినా, ప్రకటనలు ఇచ్చినా కొనే వారు కరువయ్యారు.
ALSO READ | కర్ణాటకలో కొత్త రిజిస్ట్రేషన్ రూల్.. బెంగళూరులో ఇల్లు కొంటున్న తెలుగోళ్లకు అలర్ట్..
హైదరాబాద్ కు వలసలు పెరిగిపోవడం.. మధ్య సిటీలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండటంతో ఇక్కడ ఇండ్లు ,ఫ్లాట్లు కొనుగోలు చేస్తే త్వరగా గమ్యస్థానాన్ని చేరుకోలేమన్న భావన చాలా మందిలో ఉంది. దీనికి తోడు కాలుష్యం కూడా ఈ ప్రాంతాలను ఇబ్బందుల పాలు చేస్తోంది. దీంతో మధ్య సిటీ క్రమంగా ఖాళీ అవుతోంది. ఈ పరిణామం ప్రభావం ఎలా ఉండబోతోందన్నది చర్చనీయాంశంగా మారింది.
బేగం బజార్ డిఫరెంట్
ఓల్డ్ సిటీలోని బేగంబజార్ ది డిఫరెంట్ పరిస్థితి. ప్రధాన వ్యాపార సంస్థలు అక్కడే ఉండటం, నార్త్ ఇండియా నుంచి వచ్చిన మార్వాడీలు, గుజరాతీలు, సింధీలు అక్కడ స్థిరపడ్డారు. ఇక్కడ వ్యాపార అవసరాల కోసం భూములు కొనుగోలు చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నా అమ్మే వారు లేరు. గతేడాది చదరపు గజం ధర రూ. 10 లక్షలు పలికిందంటే పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు కూడా సిటీ బయట ప్రశాంతంగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.