
Karnataka: దేశంలో టెక్ రంగానికి కేంద్రంగా ఇండియన్ సిలికాన్ వ్యాలీ అంటూ బెంగళూరుకు వచ్చిన గుర్తింపు కర్ణాటకకు పేరుతెచ్చిపెట్టింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ప్రజలు బెంగళూరుతోపాటు కర్ణాటక వ్యాప్తంగా వ్యాపారాలు చేసేందుకు, ఉపాధి అవకాశాల వేటలో అక్కడి వెళ్లారు. ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు అక్కడే స్థిరపడాని చూస్తున్నారు. అయితే అక్కడ రియల్టీ పెట్టుబడులు పెట్టాలన్నా లేక ఇల్లు కొనుక్కోవాలన్నా పరిస్థితులు గతంలో మాదిరిగా లేవు. ఈ క్రమంలో కర్ణాటక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన కొత్త రూల్ కొందరిని ఆందోళనకు గురిచేస్తోంది.
తాజాగా కర్ణాటక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇకపై అందరు సబ్ రిజిస్ట్రార్స్ రూ.30 లక్షలు లేదా అంత కంటే ఎక్కువ విలువైన ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సదరు పార్టీ నుంచి స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ తీలుసోవాలని తెలిపింది. ఈ స్టేట్మెంట్ పంచుకోవటంలో చాలా మంది సబ్ రిజిస్ట్రార్లు నిర్లక్ష్యం చూపటంపై ఆదాయాపు పన్ను శాఖ ఆగ్రహం వ్యక్తం చేయటంతో తాజా చర్యలు వచ్చాయని తెలుస్తోంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285బిఏ(1) కింద వివరాలను అందించటం తప్పనిసరి.
అసలు స్పెసిఫిక్ సమాచారం అంటే ఏంటి అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ సమయంలో సదరు రెండు పార్టీల పాన్ వివరాలు, చిరునామా, రిజిస్ట్రేషన్ తేదీ, ఫారం 60 రసీదు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్, ఆధార్ వివరాలు, డబ్బు చెల్లించిన విధానం, ట్రాన్సాక్షన్ విలువ, ప్రాపర్టీ వివరాలను ఇకపై సబ్ రిజిస్ట్రార్లు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. రెండు పార్టీలు ఈ వివరాలను సరిగా ఉన్నాయా లేదా చూసి సంతకాలు కూడా చేయాల్సి ఉంటుంది. వీటి వివరాలు అందించటంలో విఫరమైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందించటం హోల్డ్ చేయబడుతుంది.
అసలు చట్టం ఏం చెబుతోంది..?
ఎవరైనా ఒక వ్యక్తి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొన్నా లేక అమ్మినా, లేదా స్టాంప్ డ్యూటీ ప్రకారం సదరు ఆస్తి విలువ రూ.30 లక్షల కంటే ఎక్కువగా ఉంటే దానికి సంబంధించిన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఇలాంటి పెద్ద టోకెన్ లావాదేవీల గురించి సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖకు పంపడం రిజిస్ట్రేషన్ శాఖకి అప్పగించబడిన బాధ్యతల్లో ఒకటి. వాస్తవానికి ఈ చర్య బ్లాక్ మనీతో ట్రాన్సాక్షన్లను అరికట్టడంతో పాటు పన్ను ఎగవేతలను గుర్తించటం, పన్ను వసూళ్లను పారదర్శకతతో పెంచటం లక్ష్యంగా అమలులోకి తీసుకొచ్చారు.