ఖమ్మంలో ప్రాణం తీసిన నర్సు నిర్లక్ష్యం.. లో-ఫీవర్తో వస్తే ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇచ్చే సరికి..

ఖమ్మంలో ప్రాణం తీసిన నర్సు నిర్లక్ష్యం.. లో-ఫీవర్తో వస్తే ఇంజెక్షన్ ఓవర్ డోస్  ఇచ్చే సరికి..

ఖమ్మం జిల్లాలో ఓ నర్సు నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైపోయింది. లో-ఫీవర్ ఉందని ఆస్పత్రికి వస్తే ఇంజక్షన్ ఓవర్ డోస్ ఇవ్వడంతో వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. దీంతో కుటుంబ సభ్యుల ఆందోళనతో వైరా రోడ్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా మన్నెగూడెం గ్రామానికి చెందిన  బానోతు శ్రీను(20) అనే యువకుడు.. లో జ్వరం ఉందని బుధవారం (నవంబర్ 05) రాత్రి వైరా రోడ్డులోని దిశ ఆస్పత్రికి వచ్చాడు. తక్షణ ఉపశమనం కోసం ఇంజక్షన్ ఇచ్చింది నర్సు. అయితే ఓవర్ డోస్ అయ్యి.. వైద్యం వికటించి శ్రీను మృతి చెందాడు. 

శ్రీను ఇంజక్షన్ వేసిన రెండు గంటల్లో మృతి చెందటంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.  దీంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా మారిపోయింది. చివరికి కుటుంబ సభ్యులతో మాట్లాడిన యాజమాన్యం.. రూ.4 లక్షలకు సెటిల్ చేయడంతో గొడవ సద్దుమణిగింది.