వేములవాడ, వెలుగు : సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. ఆలయానికి సంబంధించిన హుండీలను బద్దిపోచమ్మ ఆలయంలో లెక్కించారు. 13 రోజులకు సంబంధించి హుండీల ద్వారా మొత్తం రూ. 2,74,62,00లతో పాటు 118.800 గ్రాముల మిశ్రమ బంగారం, 11 కిలోల మిశ్రమ వెండి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. లెక్కింపును ఆలయ ఈవో ఎల్.రమాదేవి, ఏసీ కార్యాలయ పరిశీలకులు రాజమౌళి, ఏఈఓలు, పర్యవేక్షకులు, అర్చకులు పాల్గొన్నారు.
