ఎన్నికల ఖర్చు వివరాలను ఇన్ టైమ్లో ఇవ్వాలి : ఎలక్షన్అబ్జర్వర్ దేవేందర్

ఎన్నికల ఖర్చు వివరాలను ఇన్ టైమ్లో ఇవ్వాలి : ఎలక్షన్అబ్జర్వర్ దేవేందర్

ఆసిఫాబాద్/కాగ జ్ నగర్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఖర్చు వివరాలను ఇన్​టైమ్​లో ఇవ్వాలని ఎలక్షన్​అబ్జర్వర్​దేవేందర్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో, కాగ జ్ నగర్ మున్సిపల్ ఆఫీస్ లో అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. అభ్యర్థులు సభలు, సమావేశాలు, ర్యాలీల కోసం ముందస్తుగా అనుమతి తీసుకోవాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఖర్చు వివరాలను నిర్ణీత ఫార్మాట్​లో సమర్పించాలని చెప్పారు.

ప్రత్యేక బ్యాంక్ అకౌంట్, రికార్డుల ఫైలింగ్, ఖర్చు పరిమితులపై అవగాహన  కల్పించినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఖర్చు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఏమైనా సందేహాలు ఉంటే హెల్స్​డెస్క్​లలో సంప్రదించాలని సూచించారు. కాగజ్​నగర్​మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఎలక్షన్​మాస్టర్ ట్రైనర్ ఆసిఫ్ , నోడల్ ఆఫీసర్ నదీమ్ తదితరులు పాల్గొన్నారు.