కాంగ్రెస్ పాలనలో సింగరేణి ఆగమాగం : మాజీ మంత్రి హరీశ్రావు

కాంగ్రెస్ పాలనలో సింగరేణి ఆగమాగం : మాజీ మంత్రి హరీశ్రావు
  •     మాజీ మంత్రి హరీశ్​రావు
  •     క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులకు మద్దతుగా రోడ్​షో

కోల్​బెల్ట్, వెలుగు: కాంగ్రెస్​పాలనలో సింగరేణి ఆగమాగమైందని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. శుక్రవారం రాత్రి క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన రోడ్​షోకు ఆయన హాజరై మాట్లాడారు. అటానమస్​సంస్థగా ఉన్న సింగరేణిలో గత ప్రభుత్వాలు జోక్యం చేసుకోలేదని, కోలిండియాకు ఆదర్శంగా ఉండేదన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చాక స్కామ్​లకు నిలయంగా మారిందని విమర్శించారు.

సీఎం రేవంత్​రెడ్డి చెప్పినోళ్లకే ఓబీ టెండర్లు ప్లస్​ 20కి ఇస్తూ సింగరేణికి నష్టం చేస్తున్నారన్నారు. ఒక్క నైనీ బ్లాక్​ టెండరే కాదు.. సైట్​విజట్​సర్టిఫికెట్​పై జరిగిన ఓబీ వర్క్స్, సోలార్​పవర్ ప్లాంట్స్​తదితర అన్ని టెండర్లను రద్దు​ చేయాలని డిమాండ్​ చేశారు.

బీఆర్ఎస్​హయాంలో  నెలనెలా మెడికల్ బోర్డులు పెట్టి ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. కాంగ్రెస్​ సర్కార్​ వచ్చిన రెండేండ్లలో కేవలం రెండుసార్లు మెడికల్ బోర్డులు పెట్టారన్నారు. పని చేయలేని కార్మికులకు  మెడికల్​ ఇన్​వాలిడేషన్ అవకాశం కల్పించడం లేదని తెలిపారు. అమలు చేయని పథకాల గురించి అడిగితే సీఎం డైవర్షన్​పాలిటిక్స్​చేస్తున్నారని మండిపడ్డారు. ఎరువులు, కరెంట్​బాధలు పోవాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ బాగుండాలంటే బీఆర్‌ఎస్, సీపీఐ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మొద్దు

బెల్లంపల్లి, వెలుగు: కాంగ్రెస్​పార్టీ మరోసారి మోసపూరిత హామీలు ఇస్తూ మున్సిపల్​ఎన్నికల్లో గెలవాలని చేస్తోందని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. ప్రజలు నమ్మొద్దని కోరారు. శుక్రవారం రాత్రి బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.బెల్లంపల్లి గడ్డమీద బీఆర్ఎస్​ జెండా ఎగరాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్​రావు, దుర్గం చిన్నయ్య, ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.