కాంగ్రెస్ ను గెలిపించండి.. నిధులు తీసుకొస్తా : ఎమ్మెల్యే గడ్డం వినోద్

కాంగ్రెస్ ను గెలిపించండి.. నిధులు తీసుకొస్తా : ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి, వెలుగు: మున్సిపల్​ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపిస్తే నిధులు తీసుకొచ్చి, బెల్లంపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్​అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని 4, 29, 30, 31, 32వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు ఇప్పటికే రూ.19 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

నియోజకవర్గానికి మరో రూ.500 కోట్లు తీసుకువచ్చి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఏ ఒక్కరికీ డబుల్​బెడ్​రూం ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్​అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.