నెల రోజులుగా శుభకార్యాలకు బ్రేక్ పడింది.. శ్రావణమాసంతో శుభ ముహూర్తాలు ముగియడంతో శుభకార్యాలు ఆగిపోయాయి. ఆషాడమాసం కావడంతో పెళ్లిళ్లు సహా ఏ సందడి లేకుండా పోయింది.
అయితే మళ్లీ శుభకార్యాల కార్తీకమాసం ఉత్థాన ఏకాదశి విష్ణమూర్తి మేల్కొనడం.. ద్వాదశి రోజున తులసీ మాతను వివాహం చేసుకోవడంతో సందడి మొదలైంది. 2025 నవంబర్శుభ ముహూర్తాలు ఉండటంతో హడావిడి మొదలవుతోంది. పల్లెల నుంచి పట్టణాల వరకు పెళ్లిళ్లు సహా అన్ని శుభాకార్యాలకు ఏర్పాట్లు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరీ ముఖ్యంగా పెళ్లిళ్లతో పాటుగా గృహ ప్రవేశాలకూ బలమైన ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. దీంతో మళ్లీ పెళ్లి బాజాలతో సందడి మొదలు కాబోతోంది.
శుభమూహూర్తాలుఉండటంతో శుభకార్యాల సందడి మొదలైంది..సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. మండపాలు, కేటరింగ్ లు బుక్ చేసుకోవడం..షాపింగ్ లతో హడావుడి మొదలైంది.
ఈ ఏడాది (2025) నవంబర్ లో వివాహానికి ముహూర్తాలు 15 రోజులు ఉంటాయి. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇది సంక్రాంతి వరకూ కొనసాగుతుంది. ఇక డిసెంబర్ 12న అస్తమించిన శుక్రుడు తిరిగి ఫిబ్రవరి 1న ఉదయిస్తాడు. ఈ సమయంలో 51 రోజుల పాటూ శుక్రబలం ఉండకపోవడంతో శుభకార్యాలకు బ్రేక్ ఇస్తారు.
నవంబర్ నెలలో వివాహ ముహూర్త వివరాలు
- నవంబర్: 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25, 30
- డిసెంబర్: 4, 5, 6 (కొన్ని పంచాంగాలలో తేడాలు ఉండటం వల్ల తేదీలు మార్పులు ఉండవచ్చు.)
ధనుర్మాసంలో ముహూర్తాలు ఉండవు
డిసెంబర్ 16న ప్రారంభమైన ధనుర్మాసం జనవరి 14 వరకూ ఉంటుంది. ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు నిర్వహించరు. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చి నెలలో మళ్లీ వివాహాల సీజన్ ప్రారంభమవుతుంది
